భారతదేశం, డిసెంబర్ 13 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శ్రుతి రెండు లక్షలు అడిగితే శాలిని ఇవ్వదు. ఇరిటేషన్‌గా కూర్చున్న శ్రుతి దగ్గరికి కామాక్షి వచ్చి అడుగుతుంది. దాంతో కామాక్షిపై ఫ్రస్టేట్ అవుతుంది శ్రుతి. అదంతా చూస్తూ మెట్లపై నుంచి శాలిని వస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గరున్న కుర్చీకి కాలు తగిలి అరుస్తుంది శాలిని. అక్కడే ఉన్న కామాక్షి వచ్చి పట్టుకోబోతుంది.

కానీ, కామాక్షి చేతిలో ఉన్న వాటర్ బాటిల్ శాలినిపై కాళ్లపై పడుతుంది. దాంతో మరింత అరుస్తుంది శాలిని. చిటికెన వేలి మీద పడిందని శాలిని నొప్పితో బాధపడుతుంది. క్రాంతి వచ్చి ఐస్ పెడతాడు. గతంలో పెద్ద తప్పులు చేస్తే ఇలాంటివి జరుగుతాయి. నేను ఏం చేశానో నాకు ఇంత పెద్ద శిక్ష వేశాడు. నువ్వు కూడా ఏదో పెద్ద తప్పు చేశావ్. అందుకే దేవుడు ఈ శిక్ష వేశాడు. ఇది దేవుడు ఇచ్చే వార్నింగ్. ఇంకోసారి తప్పు చేయ...