భారతదేశం, డిసెంబర్ 12 -- నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 12 ఎపిసోడ్ లో అమ్మ నన్ను కొట్టిందని రాజ్ తో శ్రుతి చెప్తుంది. నేను ఎవరినైనా ప్రేమిస్తే ఏంటీ? అని పూర్తిగా అడకుండానే కొట్టింది. మన పెళ్లికి అమ్మ అసలు ఒప్పుకోదు. నా లైఫ్ లో రెండో ముఖ్యమని నిర్ణయం తీసుకుంటా. నిన్నే పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకుని వెళ్లి ముందు నిలబడితే అమ్మనే ఒప్పుకుంటుందని శ్రుతి అనడంతో రాజ్ కు షాక్ తగులుతుంది.

సింపుల్ గా గుడిలో పెళ్లి చేసుకుందాం. అమ్మ రాంగ్ అని ప్రూవ్ చేయాలి. రేపే రామాలయంలో పెళ్లి అని రాజ్ తో శ్రుతి అంటుంది. శ్రుతిని ఫాలో చేసిన మధు శాలినికి కాల్ చేస్తాడు. రేపు రామాలయంలో పెళ్లి చేసుకుందామని శ్రుతి చెప్పిందని మధు చెప్పాడు.

పెన్ కెమెరా ముందుకు శాలిని వచ్చిందని చూసి చంద్రకళ కావాలని రెచ్చగొడుతుంది. నిన్ను రాక్షసిలా మార్చింది మీ అమ్మే కదా అని అని చంద్...