భారతదేశం, డిసెంబర్ 1 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ లో శాలిని ప్రెగ్నెన్సీ అబద్ధమని చంద్రకళ తెలుసుకుంటుంది. ఈ విషయం బయట పెడితే ఇంట్లోవాళ్లు ఏమైపోతారు? ముఖ్యంగా క్రాంతి తట్టుకోగలడా? అని ఆలోచించి చంద్ర ఇంటికి వెళ్తుంది. శాలినిని బయటకు తీసుకొస్తాడు క్రాంతి.

అక్కడే శాలినిని జూబ్లీహిల్స్ ఎటు వెళ్లాలని రఘురాం అడుగుతాడు. ఈ మనిషి మర్చిపోయారని శాలిని వదిలించుకోవాలని చూస్తుంది. విరాట్ కనిపించలేదని బాధతో ఇంటికి వచ్చి తల్లి జగదీశ్వరికి చెప్తాడు. క్రాంతి ఇంటికి వచ్చి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? నేను కూడా మీకు పరాయివాణ్నేనా? అని అడుగుతాడు. ఏంటి క్రాంతి అసలే మామయ్య కనిపించడం లేదనే టెన్షన్ లో ఉంటే చెప్పలేదని సీరియస్ అవుతావు అని శాలిని అంటుంది.

కాసేపు వెయిట్ చేసి పోలీస్ కంప్లయింట్ ఇద్దామని శాలిని అంటుంది. మామయ్య రాకుండా రాంగ్ అడ్రస్ చెప్పి కన్ ఫ్య...