భారతదేశం, జూలై 16 -- నిన్ను కోరి టుడే జూలై 16వ తేదీ ఎపిసోడ్ లో గుడిలో దాంపత్య వ్రతానికి సిద్ధమవుతారు విరాట్, చంద్రకళ. వాళ్లు ముడుపు చేతుల్లోకి తీసుకుంటారు. కుటుంబంతో సంతోషంగా ఉండాలని చంద్ర.. చంద్రకు తన స్థానం తెలియాలని విరాట్ కోరుకుంటారు. ముడుపు చెట్టుకు కట్టేందుకు చంద్ర ఇబ్బంది పడుతుంది. శ్యామల చెప్పడంతో చంద్రకళను ఎత్తుకుంటాడు విరాట్. అప్పుడు ముడుపు కడుతుంది. చంద్ర పడిపోతుంటే పట్టుకుంటాడు విరాట్. అప్పుడు ఇద్దరు ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటారు.

ఇద్దరు కలిసి కోనేటిలో మునిగి, గుడి చుట్టూ అయిదు ప్రదక్షిణలు చేయాలని పంతులు చెప్తారు. ఎలాంటి ఆటంకం లేకుండా వ్రతం చేస్తేనే ఫలితం దక్కుతుందంటారు. చంద్రకళ మీద కోపంతో కావాలని వ్రతంలో ఏమైనా ఇబ్బంది కలిగించావు అంటే బాగుండదు అని శ్యామల వార్నింగ్ ఇస్తుంది. ఆటంకం కలిగించేందుకు మేం ఉన్నాం కదా అని కామాక్షి, ...