భారతదేశం, జూలై 15 -- నిన్ను కోరి సీరియల్ టుడే జూలై 15వ తేదీ ఎపిసోడ్ లో విరాట్ కోసం ఎదురు చూస్తుంటుంది చంద్రకళ. తనను చెంపపై కొట్టిందే గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు? ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? అని చంద్ర అంటే.. ఆపు నీ డ్రామాలు అని విరాట్ సీరియస్ అవుతాడు. భోజనం చేయమంటే చేయను అంటాడు. జగదీశ్వరి చెప్పడంతో సరే అమ్మ అని తినడానికి రెడీ అవుతాడు విరాట్.

డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చొని కూరలు ఎవరు చేశారు అని అడుగుతాడు విరాట్. చంద్రకళ చేసిందని శ్యామల అంటే.. తన తల్లి చేసిన వంటనే తింటానని విరాట్ చెప్తాడు. కానీ దేవుని కోసం చేసిన ప్రసాదమే ఉందని చెప్తారు. ఆ పులిహోర కొంచమే ఉన్నా తినేసి వెళ్లిపోతాడు విరాట్. దీంతో చంద్రకళ ఎంతో బాధపడుతుంది. జగదీశ్వరి కూడా బాధపడితే శ్యామల ఓదార్చుతుంది. అనవసరంగా టెన్షన్స్ పెట్టుకోకు, నేను ఏదో ఒ...