భారతదేశం, జూలై 25 -- నిన్ను కోరి టుడే జులై 25వ తేదీ ఎపిసోడ్ లో చంద్రకళను అపార్థం చేసుకున్నందుకు విరాట్ ఫీల్ అవుతాడు. అవేం పట్టించుకోకుండా, నన్ను చంటి పిల్లాడిలా చూసుకున్నావు. నువ్వు చేసింది నేనెప్పటికీ మర్చిపోను చంద్ర అని ప్రేమతో మాట్లాడతాడు విరాట్. ఇది చూసి కామాక్షి, శ్రుతి షాక్ అవుతారు. నీ మీద ప్రేమతో మాత్రమే ఇదంతా చేశాను బావ అని చంద్ర అంటుంది. విరాట్, చంద్ర మధ్య బంధాన్ని తుంచేయాలని కామాక్షి, శ్రుతి అనుకుంటారు.

క్రాంతిలోని కోపాన్ని పొగొట్టేందుకు శాలిని ట్రై చేస్తుంది. నేను చేసింది తప్పని ఒప్పుకున్నా కదా. మరోసారి అలా చేయను. మనమిద్దరం మూవీకి వెళ్దామా? అని క్రాంతిని హగ్ చేసుకుని శాలిని అడుగుతుంది. భార్యభర్తల బంధం అబద్ధం, మోసం అనే పునాదుల మీద ఉంది. త్వరలోనే విడాకులిస్తానని క్రాంతి అంటాడు. నేను మాత్రం నీతో కలిసి బతకలేను అని క్రాంతి సీరియస్ ...