భారతదేశం, జూలై 22 -- నిన్ను కోరి సీరియల్ టుడే జులై 22వ తేదీ ఎపిసోడ్ లో అమ్మవారు పోసిన విరాట్ ను ఎలా చూసుకోవాలో పూజారిని అడిగి తెలుసుకుంటుంది చంద్రకళ. ఇది ఆషాడ మాసం కాబట్టి అమ్మవారికి బోనం సమర్పించుకుంటే మంచిది. కానీ ఏదైనా తప్పు జరిగితే అమ్మవారు ఆగ్రహిస్తుంది. మధ్యలో బోనం నేలపాలు అయితే అరిష్టం అని చంద్రతో పూజారి చెప్తాడు.

క్రాంతి వేప కొమ్ములు, తెల్లని వస్త్రం తెచ్చి నేలపై పరుస్తాడు. విరాట్ ను లేపి పడుకోబెడతారు. పక్కనే కూర్చుని వేప కొమ్మలతో విసురుతూ ఉంటుంది చంద్రకళ. ఓ వైపు బాధపడుతూనే విరాట్ కు అన్ని సేవలు చేస్తుంది చంద్రకళ. అలా రెండు మూడు రోజులు గడుస్తుంది. చంద్రకళ రాత్రి పగలు కంటి మీద కునుకు లేకుండా చూసుకుంటూ ఉంటుంది.

ప్రతి రోజు నిష్ఠగా పూజలు చేస్తుంది. విరాట్ కు సేవలు చేస్తుంది. విరాట్ నేల మీద పడుకున్నాడని తాను కూడా నేల మీదే పడుకుంటుంది...