భారతదేశం, జూన్ 18 -- నిన్ను కోరి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో కావాలని యాక్సిడెంట్ చేయడం ఏంటీ అని శ్యామల కోపంతో ఊగిపోతూ గిరిజతో అంటుంది. అన్నయ్యకు యాక్సిడెంట్ చేసి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అని శ్యామల ఫైర్ అవుతుంది. ఏదో దాస్తున్నారని శ్యామల అంటే.. అలాంటిదేమీ లేదని జగదీశ్వరీ చెప్తుంది. మీ అన్న వరదరాజులు పనే కదూ అంటూ శ్యామల ఆగ్రహంతో రగిలిపోతుంది. అత్తయ్య ఆవేశపడకు అని విరాట్ కంట్రోల్ చేయాలని చూస్తాడు.

చంద్రకళ నీ తల్లిదండ్రులు అలాంటి వాళ్లు కాదు కదా అని శ్యామల అనే సరికి అందరూ తెగ టెన్షన్ పడతారు. ముఖ్యంగా తన తల్లిదండ్రుల గురించి ఎక్కడ బయటపడుతుందో అని చంద్ర వణికిపోతుంది. నీ అత్త పడ్డ కష్టం అంతా ఇంతా కాదు చంద్రకళ.. మా అన్నను చంపడానికి చాలా సార్లు ప్రయత్నించారని శ్యామల ఎమోషనల్ అవుతుంది. నీకు అలాంటి పరిస్థితి రాకూడదని చంద్రకళతో చెబుతుంది శ్యామల.

న...