Hyderabad, ఆగస్టు 11 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అన్నదమ్ములు తమ భార్యలతో కలిసి భోజనం చేస్తుంటే శ్యామల వచ్చి వడ్డిస్తుంది. నేను వడ్డిస్తానని చంద్ర అంటే నువ్వు ఇక్కడ ఉండేది 28 రోజులే అని శ్యామల అంటుంది. దానికి ఎదురు చెబుతుంది చంద్రకళ. విరాట్ ఎందుకు ఎదురుచెబుతావని అంటాడు.

లేకుంటే ఏంటీ బావ ప్రతిసారి గడువు గుర్తు చేస్తుంది. ఇక్కడ ఉన్నన్ని రోజులు నా భర్తతో కలిసి తినాలని ఉండదా. నేను నా భర్తకు సేవలు చేస్తూ కలిసి భోజనం చేస్తాను. అది మీరు చూడలేకపోతుంటే ఇక్కడ ఉండకండి. మేము తిన్నాక వచ్చి తినండి అని చంద్రకళ అంటుంది. అది అన్ని మాటలు అంటుంటే ఏం అనవేంట్రా అని శ్యామల కోప్పడుతుంది.

మీ గొడవల్లోకి నన్ను లాగకండి అని విరాట్ అంటాడు. దాంతో ఏం చేయలేక కోపంగా వెళ్లిపోతుంది శ్యామల. క్రాంతి చింపేసిన విడాకుల పేపర్స్ ఉన్న డస్ట్ బిన్‌ను పని మనిషి మంగమ్మ హా...