భారతదేశం, జూలై 9 -- నిన్ను కోరి జూలై 9వ తేదీ ఎపిసోడ్ లో నగలు మా చేతికి రాకపోతే పోలీస్ కంప్లయింట్ ఇస్తామని జగదీశ్వరి ఫ్రెండ్ సరిత వార్నింగ్ ఇస్తుంది. ఈ అమ్మాయి మమ్మల్ని ముంచేయడానికి ఇలా నటించిందని చంద్రకళను తిడుతుంది. కానీ ఈ చిన్న ఇష్యూ వల్ల మీరు పోలీసు కంప్లయింట్ ఇస్తే మా ఇంటి పరువు పోతుంది. ఆ నగలు కొనడానికి ఎంత డబ్బు అయిందో చెప్పండి ఇచ్చేస్తామని విరాట్ అంటాడు.

డబ్బు మా దగ్గర లేదా? అవి మామూలు నగలు కావు. మొక్కు చెల్లించడానికి చేయించిన నగలు. అవి లేకపోతే మేం గుడికి వెళ్లలేం. మాకు ఆ నగలే కావాలి అని సరిత ఖరాకండీగా చెప్పేస్తుంది. మీకు కొంచెం టైమ్ ఇస్తున్నాం, నగలు ఇవ్వకపోతే మాత్రం పోలీస్ కంప్లయింట్ ఇవ్వకుండా వదలం అని వాళ్లు వెళ్లిపోతారు.

దొరికిందే ఛాన్స్ కదా అని చంద్రకళను కామాక్షి నానా మాటలు అంటుంది. నన్ను క్షమించండి అత్తయ్య అని చంద్ర అంటే.. ప...