భారతదేశం, జూలై 8 -- నిన్ను కోరి జూలై 8 ఎపిసోడ్ లో జగదీశ్వరి ఫ్రెండ్ సరిత ఇచ్చిన అమ్మవారి నగలను ఇంట్లో దాస్తారు. చంద్రకళ నగలు అన్ని తీసుకొని తన గదిలోకి వెళ్లి లాకర్ లో పెడుతుంది. చంద్రను దెబ్బకొట్టేందుకు ఇదే మంచి ఛాన్స్ అని శాలిని అనుకుంటుంది. రాత్రి అందరూ పడుకున్నాక శాలిని బయటకు వచ్చి ఓ వ్యక్తికి కాల్ చేస్తుంది. దొంగతనం చేయాలని చెప్తుంది. చంద్ర రూమ్ లోకి వెళ్లి నగలు తీసుకురమ్మని చెప్తుంది.

లాకర్ తాళం చెవులు ఎక్కడ ఉన్నాయో ఆ వ్యక్తికి శాలిని చెప్తుంది. అంతకుముందు కప్ బోర్డ్ లో చంద్ర కీస్ పెట్టడం శాలిని చూస్తుంది. శాలిని ఫోన్లో మాట్లాడింది కామాక్షి, శ్రుతి వింటారు. నీ ప్లాన్ మాకు తెలిసిపోయింది, మేం ముందే గెస్ చేశాం అని కామాక్షి, శ్రుతి అంటారు. ఈ దెబ్బతో చంద్ర పొగరు అణిగిపోతుంది, తాళం చెవులు నీ చేతికి వస్తాయని శాలినితో అంటారు.

ఆ దొంగ నెమ్మద...