Hyderabad, జూలై 3 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శ్యామల అందరిని పిలిచి వంట పోటీలకు అన్ని సిద్ధం చేసి పెడుతుంది. అందరూ అక్కడికి వస్తారు. కానీ, వంట పోటీలో శ్యామల ఒక కండిషన్ పెడుతుంది. పదినిమిషాల సమయంలోపు ఎవరైతే అద్భుతంగా రుచికరంగా వంట వండుతారో వాళ్లు ఈ పోటీలో గెలిచినట్లు అని శ్యామల చెబుతుంది.

అలాగే, గ్యాస్, ఆయిల్ రెండు వాడకుండా రుచికరంగా ఏదైనా పది నిమిషాల్లో వండాలి అని శ్యామల కండిషన్స్ చెబుతుంది. దానికి అంగీకరించిన శాలిని, చంద్రకళ ఇద్దరూ పోటీకి సిద్దమవుతారు. అలాగే తమకు నచ్చినట్టు వండటానికి రెడీ అవుతారు.

శాలిని శాన్విజిని వండుతానని, చంద్రకళ ముంత మసాలా వండుతానని చెబుతారు. ఇద్దరు వండుతున్న సమయంలో చంద్రకళని ఎలాగైనా ఇబ్బందుల్లో పెట్టి తన వంట చెడగొట్టాలని కామాక్షి, శ్రుతి ఇద్దరూ ప్రయత్నాలు చేస్తారు. చంద్రకళ దగ్గరికి వెళ్లి వంట చెడగొట్ట...