Hyderabad, జూలై 26 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో గుడిలో తల్లి సుభద్రను కలిసిన చంద్రకళ మాట్లాడుతూ ఉంటుంది. చంద్రకళ, సుభద్ర మాట్లాడుకోవడం దుష్టత్రయం అయిన కామాక్షి, శ్రుతి, శాలిని ముగ్గురు చూస్తారు. ఎంత మంచి సీన్. ఈ సీన్‌ను శ్యామల చూస్తే కచ్చితంగా చంద్రకళకు ఉంటుంది అని అనుకుంటారు.

ఎలాగైనా చంద్రకళ, సుభద్రలను శ్యామల చూడాలని ముగ్గురు ప్లాన్ చేస్తారు. అలా చేసి శ్యామల చంద్రకళవైపు వెళ్లేలా చేస్తారు కామాక్షి, శాలిని, శ్రుతి. సుభద్రతో మాట్లాడుతున్న చంద్రకళను చూసి శ్యామల ఒక్కసారిగా ఉలిక్కిపడి షాక్ అవుతుంది. అన్నయ్యకు భద్ర శత్రువు అయిన వరదరాజులు కుటుంబంలోని మనిషితో చంద్రకళ మాట్లాడటం ఏంటీ అని ఆశ్చర్యపోతుంది.

కాస్తా దగ్గరికి వెళ్లి వాళ్ల మాటలు వింటుంది. దాంతో సుభద్ర కూతురే చంద్రకళ అని తెలిసి మరింత షాక్ అవుతుంది శ్యామల. సుభద్ర కూతురు విరాట్‌క...