Hyderabad, జూలై 24 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో విరాట్‌కి దాహం వేయడంతో మంచినీళ్లు తాగడానికి హాల్లోకి వస్తాడు. అక్కడ జగదీశ్వరి ఏదో ఆలోచిస్తూ విరాట్‌ని చూసి ఎందుకు కిందికి వచ్చావు. గదిలోనే ఉండొచ్చు కదా అని అంటుంది.దానికి దాహంగా ఉంది అమ్మ అని విరాట్ చెబుతాడు.

విరాట్‌కు మంచినీళ్లు తాగిస్తుంది జగదీశ్వరి. ఇంతలో గుడికి వెళ్లిన చంద్రకళ, శ్యామల, శ్రుతి, శాలిని, కామాక్షి ఇంటికి వస్తారు. అమ్మవారికి చంద్రకళ సంపూర్ణ నైవేద్యంతో బోనం సమర్పించింది. తప్పకుండా విరాట్‌కి నయమైపోతుంది అని జగదీశ్వరితో శ్యామల చెబుతుంది. అలాగే, శాలిని బోనం కింద పడబోతుంటే చంద్రకళ పడకుండా కాపాడింది అని శ్యామల చెబుతుంది.

దానికి శాలినికి కోపంతో ఊగిపోతుంది. ఇక గుడిలో శృతి, కామాక్షి దొంగతనం చేశారని, కొరడాతో కొట్టించారని శ్యామల చెబుతుంది. అనంతరం అంతా వెళ్లిపోతారు. గుడి నుం...