Hyderabad, జూలై 2 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శాలినికి ఇంటి బాధ్యతలు అప్పజెప్పడంపై చంద్రకళ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దాంతో తోడి కోడళ్లు అయిన చంద్రకళ, శాలిని మధ్య శ్యామల పోటీ పెడతానంటుంది. దానికి ఇంట్లో వారందరూ ఒప్పుకుంటారు.

తర్వాత జగదీశ్వరి దగ్గరికి వచ్చిన కామాక్షి చంద్రకళ ఈ ఆస్తి పోటీలో పాల్గొనడానికి ముఖ్య ఉద్దేశం ఏదో ఉంది. తనకు ఈ ఆస్తి మీద కన్నుంది. అందుకే నిన్న మనతో ఇంటి బాధ్యతలు ఎవరికైనా అప్పజెప్పండి నాకు అవసరం లేదు అని చెప్పి ఇప్పుడు తను కూడా ఈ ఇంటి బాధ్యతలు కావాలంటుంది. దీని వెనకాల ఏదో మర్మం ఉంది అంటుంది.

అప్పుడే అక్కడికి చంద్రకళ వస్తుంది. జగదీశ్వరితో శాలిని ఈ ఇంటిని కొల్లగొట్టడానికి పగ పట్టి ఇక్కడికి వచ్చిందన్న విషయం చెప్పుదామని చంద్రకళ అనుకుంటుంటే జగదీశ్వరి మాట వినకుండా రివర్స్‌లో తిడుతుంది. చంద్రకళని అత్త జగదీశ్వర...