Hyderabad, జూలై 18 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శాలిని ఇంట్లో కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. క్రాంతికి నిజం తెలిసిపోయిందని తెగ భయపడిపోతుంటుంది. ఇంతలో అక్కడికి జగదీశ్వరి వచ్చి ఏమైంది షాలిని, అంతలా కంగారుగా ఉన్నావేంటీ, ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయేంటీ అని అడుగుతుంది.

దానికి ఏం లేదు, ఎండలో ఉన్నాను అందుకే మొహం మీద చెమటలు పడుతున్నాయి, కాస్తా నీరసంగా ఉంది అని శాలిని చెబుతుంది. అయితే, వెళ్లి నీళ్లు తాగమని జగదీశ్వరి చెబుతుంది. దాంతో శాలిని వెళ్లిపోతుంది. అప్పుడే అక్కడికి గుడి నుంచి శ్యామల విరాట్ చంద్రకళ కామాక్షి శ్రుతి వస్తారు.

గుళ్లో వీళ్లకు దాంపత్యవ్రతం చేయించాను అని శ్యామల చెబుతుంది. అప్పుడే చిరాకుతో విరాట్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. కామాక్షి శ్రుతి మీరెందుకు వెళ్లారు అని జగదీశ్వరి అడిగితే.. పెళ్లి గురించి కోరుకోవడానికి వెళ్లాన...