భారతదేశం, జూలై 17 -- నిన్ను కోరి సీరియల్ టుడే జూలై 17వ తేదీ ఎపిసోడ్ లో చంద్రకళ, విరాట్ చేయబోయే వ్రతానికి ఆటంకం కలిగించేందుకు కామాక్షి, శ్రుతి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. విరాట్, చంద్రకళకు బ్రహ్మముడి వేయాలని పంతులు అంటే.. ఇదేమైనా వివాహమా? అని అడుగుతాడు విరాట్. కానీ శ్యామల చెప్పేసరికి పంతులు బ్రహ్మముడి వేస్తాడు. యజ్ణం ప్రారంభిస్తారు. హోమం నుంచి వచ్చే పొగ పీల్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అని శ్రుతి దగ్గరగా కూర్చుంటుంది.

శ్రుతి ఒక్కసారిగా హోమంలో కెమికల్ పౌడర్ చల్లుతుంది. అందరూ షాక్ అవుతారు. ఏం చేశావే నువ్వు అంటూ శ్రుతిని కొడుతుంది శ్యామల. తను మంచి పనే చేసింది. అలా కర్పూరం పొడి చల్లితే మంట ఆరిపోకుండా ఉంటుంది. పూర్ణాహుతి జరిగే వరకూ కర్పూరం అలాగే వేస్తూ ఉండమ్మ అని పంతులు అనడంతో ఈ సారి కామాక్షి, శ్రుతి షాక్ అవుతారు. నీకు మంచి మొగుడే వస్తా...