Hyderabad, జూలై 12 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో విరాట్ ప్రాజెక్టు సంబంధించిన ఫైల్ మొత్తం కంప్లీట్ చేసుకుని కిందికి వెళ్లి బిజినెస్ మాన్ గురించి వెయిట్ చేయాలి అని అనుకుంటాడు. అదే సమయానికి చంద్రకళ విరాట్ దగ్గరికి వస్తుంది. ఇంతలో ఇద్దరు ఒకేసారి డోర్ తీయడంతో ఇద్దరు కిందపడిపోతారు.

ఒకరిపై మరొకరు పడి రొమాంటిక్‌గా చూసుకుంటారు విరాట్, చంద్రకళ. తర్వాత బిజినెస్ మ్యాన్ వస్తున్నాడు. నువ్ ఇక్కడే ఇదే రూమ్‌లో ఉండు, కిందకు రాకు. నేనే ప్రజంటేషన్ ఇచ్చుకుంటాను అని చంద్రకళకు విరాట్ వార్నింగ్ ఇస్తాడు. దాంతో చంద్రకళ సరే సరే శ్రీవారు. మీరే వెళ్లి నీ ప్రజెంటేషన్ ఇచ్చుకో. నేను పైనే ఉంటాను అని చెబుతుంది.

విరాట్ కిందికి వెళ్లిపోతాడు. తరువాత విరాట్ తన అమ్మ జగదీశ్వరి దగ్గరికి వచ్చి ఈ ప్రాజెక్టు ఓకే అయ్యేలాగా నన్ను ఆశీర్వదించమని అడగుతాడు. దాంతో ఏ ఆశీర్వాదం...