భారతదేశం, జూలై 11 -- నిన్ను కోరి జూలై 11వ తేదీ ఎపిసోడ్ లో సోఫాలో కూలబడ్డ జగదీశ్వరీని చూసి అందరూ కంగారు పడతారు. చంద్రకళ సమస్యను పరిష్కరిస్తుందని చెప్పా కదా, ఇప్పుడు ఏం అంటారు? అవసరమైతే ఇంటి కోసం తన ప్రాణాలు పణంగా పెడుతుంది అని శ్యామల అంటుంది. బైక్ నంబర్ ద్వారా దొంగ అడ్రస్ కనిపెట్టామని విరాట్ చెప్తాడు. నువ్వు సూపర్ వదిన అని క్రాంతి పొగిడేస్తాడు.

దొంగతనం ఎవరైనా కావాలని చేయించారా? అని చంద్రకళ అనుమానపడుతుంది. దీంతో కామాక్షి కంగారు పడుతుంది. జాగ్రత్తగా ఉండు శాలిని అని చెప్తుంది. గదిలోకి వెళ్లి థ్యాంక్యూ శ్రీవారు అని విరాట్ తో చెప్తుంది చంద్ర. నా మీద నీకు ప్రేమ ఉంది బావ. చూశావా నాకోసం నువ్వు నాతో పాటు బయటికి వచ్చి ఆ దొంగని పట్టుకోవడానికి సహాయం చేశావు. నేనంటే నీకు ఇష్టం బావ అని చంద్రకళ విరాట్ తో అంటుంది.

విరాట్ నేను నీకోసం రాలేదు. ఈ ఇంటి కోసం వ...