భారతదేశం, జూలై 10 -- నిన్ను కోరి టుడే జూలై 10 ఎపిసోడ్ లో దొంగ అడ్రస్ వెతుక్కుంటూ విరాట్, చంద్రకళ వెళ్తారు. నా ఇంట్లో దొంగతనం చేసిన వాడిపై కోపంతో ఊగిపోతాడు విరాట్. మనం నగల కోసం వస్తే వాడు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది, అందుకే తెలివిగా డీల్ చేద్దామని చంద్రకళ అంటుంది. బయట ఆ దొంగ బైకు ఆగి ఉండటం గమనిస్తారు. డోర్ దగ్గరికి వెళ్లి ఓపెన్ చేయమంటారు. ఎవరై ఉంటారు అని ఆ దొంగ అనుకుంటాడు.

ఎవరు అని దొంగ అడుగుతాడు. ఈ బస్తీలో సొంత ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇప్పించే స్కీమ్ గవర్నమెంట్ తెచ్చిందని, వివరాలు కావాలని చంద్రకళ చెప్తుంది. నమ్మకపోతే మీరే నష్టపోతారని విరాట్ అంటాడు. మీకు డబ్బులు కూడా వస్తాయని ఆశ కల్పిస్తారు. ఆ దొంగ డబ్బుల గురించి ఆలోచించి డోరు తీస్తాడు. లోపలికి వచ్చిన విరాట్ నగలు ఎక్కడ దాచావని అడిగి, ముఖంపై బలంగా పంచ్ ఇస్తాడు. దొంగను విరాట్, చంద్రకళ కొడతార...