Hyderabad, జూలై 1 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో విరాట్ ఇంటికి వచ్చి శాలినిని పిలుస్తాడు. దాంతో అంతా అక్కడికి వస్తారు. మీటింగ్ చేసింది నువ్వేనా అని విరాట్ అడిగితే నేనే అని శాలిని చెబుతుంది. అసలు నిన్ను మీటింగ్‌కు ఎవరు వెళ్లమన్నారని విరాట్ సీరియస్‌గా అడుగుతాడు. దాంతో అత్తయ్య చెప్పింది అని శాలిని అంటుంది.

దాంతో విరాట్ ఏం మాట్లాడడు. అసలు నువ్ వెళ్లిన మీటింగ్ ఏం అయిందో తెలుసా. సక్సెస్ అయిందని విరాట్ అంటాడు. దాంతో అంతా హ్యాపీ అవుతారు. ఇక శాలినిని విరాట్, జగదీశ్వరి, కామాక్షి, శ్రుతి అంతా పొగుడుతుంటారు. ఆ పొగడ్తలకు శ్యామల ఉప్పొంగిపోతుంది.

ఇంతలో వచ్చిన శ్యామల ఒక్కసారి గెలిచినదానికే ఇంత ఆనందపడిపోమాకు. ఇలాంటివి చంద్రకళ ఎన్ని చేసిందో అని శ్యామల పొగుడుతుంది. దాంతో దుష్ట త్రయం హర్ట్ అవుతారు. సరేలే.. మొత్తానికి శాలిని ఈ ఒక్క విజయం సాధించింది...