Hyderabad, జూన్ 30 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చంద్రకళ దగ్గరికి విరాట్ వచ్చి చూశావు కదా వాళ్లు నేరం చేశారని శ్యామల అత్తకు తెలిసిన వెంటనే ఎలా రెచ్చిపోయిందో. ఒకవేళ నువ్వు సుభద్ర కూతురు అని తెలిస్తే నిన్ను ఏం చేస్తుందో నీ ఊహకే వదిలేస్తున్నాను. అప్పుడు నేను నిన్ను అవాయిడ్ చేయడం కాదు శ్యామల అత్తే నిన్ను మెడపట్టి బయటికి గెంటేస్తుంది. తన కోపం నీకు శాపంగా మారుతుంది అని విరాట్ అంటాడు.

దాంతో చంద్రకళ బాధపడుతుంది. పిన్ని గారికి నిజం తెలిస్తే నిజంగానే బయటకు పంపించిస్తారేమో అని భయపడుతుంది. మరోవైపు శృతి, కామాక్షి ఇద్దరు కొన్ని చీరలు తీసుకొచ్చి సర్దుతూ ఉంటే అక్కడికి శ్యామల వస్తుంది. ఏంటి ఇన్ని చీరలు తీసుకొచ్చారు. ఎందుకు అని అడుగుతుంది. మేము కొత్తగా ఇప్పుడు చీరలు బిజినెస్ పెట్టాము అని తల్లీకూతుళ్లు చెబుతారు.

ఇదివరకే పచ్చళ్ల బిజినెస్ పెట్టి ద...