Hyderabad, జూన్ 24 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో తల్లి జగదీశ్వరిన తన చేతికి కట్టు కట్టడంతో మురిసిపోతాడు విరాట్. చంద్రకళ అడిగితే ఇన్నిరోజుల తర్వాత అమ్మ స్పర్శ తగిలింది. అమ్మకు నా మీద కోపం ఉన్న లోపల ప్రేమ ఉంది. ఎప్పటిలా నాపై ప్రేమ చూపిస్తుందని నాకు నమ్మకం ఉందని చెబుతాడు విరాట్.

నీకు ఎలా ఉందో నాకు నీ మీద అలాగే ఉందని చంద్రకళ అంటుంది. నటించకు చంద్ర. నాకు దెబ్బ తగిలితే నువ్ రాలేదని విరాట్ అంటే.. అత్తయ్య రావడం చూసే నేను ఆగిపోయాను. అత్తయ్య బయటపడే సందర్భాన్ని నీకు దూరం చేయాలని అనుకోలేదని చంద్ర అంటుంది. తర్వాత ఇంట్లోకి ఫొటోగ్రాఫర్స్ వస్తారు. విరాట్ పిలిపించుకున్నాడనుకుని భలే సర్‌ప్రైజ్ ప్లాన్ చేశావని శ్యామల అంటుంది.

నాకేం తెలియదని విరాట్ అంటే వాళ్లను పిలిచింది తనేనని కామాక్షి చెబుతుంది. కామాక్షి, శ్రుతి రెడీ అయి ఉంటారు. రోజులు మారాలి, ప...