Hyderabad, జూన్ 16 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శోభనం గదిలో పాల గ్లాస్ కిందపడటంతో శ్యామలకు అనుమానం వస్తుంది. దాంతో డోర్ దగ్గరే ఉండి విరాట్, చంద్రకళ మాటలు వింటుంది. అది డైవర్ట్ చేయడానికి చంద్రకళ పుష్ప 2 సాంగ్ పెడుతుంది. ఆ పాటకు శ్యామల డ్యాన్స్ చేస్తుంది. అక్కడి నుంచి శ్యామల తీసుకెళ్లడానికి వచ్చిన కామాక్షిని కూడా డ్యాన్స్ చేసేలా చేస్తుంది శ్యామల.

శోభనం గదిలో విరాట్‌పై పడుతు ముద్దులు పెడుతుంటుంది చంద్రకళ. ఈ క్రమంలో బెడ్ మీద పడిపోతారు చంద్రకళ, విరాట్. దాంతో మంచం విరిగిన సౌండ్ వస్తుంది. అది విని శ్యామల సిగ్గుపడుతూ వెళ్లిపోతుంది. దుష్ట త్రయం షాక్ అవుతారు. విరాట్‌ నడుముకు దెబ్బ తగలడంతో బామ్ రాస్తుంది చంద్రకళ. విరాట్‌నే ప్రేమగా చూస్తూ పడుకుంటుంది చంద్రకళ.

మరోవైపు చంద్రకళ ఇచ్చిన సజెషన్స్‌తో క్రాంతి డిజైన్స్ వేస్తాడు. అక్కడికి వచ్చిన శ...