Hyderabad, జూన్ 14 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో విరాట్, చంద్రకళ శోభనానికి గదిని పూలతో కామాక్షి, శ్రుతితో డెకరేట్ చేయిస్తుంది శ్యామల. శ్రుతికి చేయరాకుంటే కామాక్షిని తిడుతుంది శ్యామల. ఇలాంటివి చేస్తేనే కదా దానికి కల్యాణం అవుతుందని శ్యామల అంటే.. దానికి కల్యాణం కావాలంటే ముందు ఈ చంద్రకు విడాకులు కావాలి కదా అని కామాక్షి గొణుకుతుంది.

ఇంతలో విరాట్ వచ్చి శోభనం ఏర్పాట్లు చూసి షాక్ అవుతాడు. చంద్రకు నీకు ఫస్ట్ నైట్. అందుకే కాల్ చేసి త్వరగా రమ్మన్నాను అని శ్యామల అంటుంది. చంద్రకళను మెల్లిగా తిడతాడు విరాట్. నాకేం సంబంధం లేదు. పిన్నిగారు చేశారు అని చంద్ర అంటుంది. ఏంట్రా అల్లుడు సర్‌ప్రైజ్ అయ్యావా అని శ్యామల అంటుంది. ఈ సర్‌ప్రైజ్ అమ్మకు తెలుసా. ఒప్పుకుందా అని విరాట్ అంటాడు.

ఏ తల్లి కాదంటుందిరా. ఒప్పుకుందని చెప్పిన శ్యామల చంద్రకళ నిన్ను రెడీ చ...