Hyderabad, జూన్ 13 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మావయ్య నిజంగానే కళ్లు ఆర్పారు అని చంద్రకళ చెబితే విరాట్ చిరాకు పడతాడు. ప్రతి దానికి తింగరగా ఆలోచిస్తావ్. అదే వంకరగా ఆలోచిస్తావ్ అని చంద్రకళ అంటుంది. ఏంటిది బావ ఉక్కపోస్తుంటే ఫ్యాన్ వేసుకోకుండా అని చంద్రకళ ఫ్యాన్ వేస్తుంది. దాంతో గాల్లోకి పేపర్స్ అన్ని ఎగురాతాయి.

చంద్రకళను తిట్టి పేపర్స్ తీయమంటాడు. ఈ క్రమంలో విరాట్, చంద్రకళ తలలు గుద్దుకుంటాయి. తర్వాత చంద్రకళ గుద్దుకుని పడబోతుంటే పట్టుకుంటాడు విరాట్. చిరాకు తెప్పిస్తున్నావే అని విరాట్ అంటాడు. మీ చిరాకు పోయేందుకు ఒక ముద్దు పెట్టమంటారా అని చంద్రకళ అంటుంది. మన మధ్య జరుగుతుంది సమరం, సరసం కాదని విరాట్ అంటాడు.

అర్థమైంది లేండి. ఇంకా మన మధ్య ఫస్ట్ నైట్ జరగలేదని కదా. ముహుర్తం పెట్టించమంటారా అని చంద్రకళ అంటుంది. మరోవైపు రెండు రోజుల్లో డిజైన...