Hyderabad, జూన్ 12 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అత్తయ్య తన మీద ఎంతో కొంత ప్రేమ దాచుకున్నారు. దాన్ని బయటకు తీసుకొస్తాను అని చంద్రకళ అంటుంది. అదంతా నిజం కాదు. నిన్ను అత్తయ్య కోసం భరిస్తుంది. నిన్ను ఇంట్లో ఉండనివ్వడం అనేది నీ మీద జాలితో నా మీద ఉన్న కోపంతో. అది అమ్మ నాకు వేసిన శిక్ష. అమ్మ ఇప్పుడు నాతో మాట్లాడట్లేదు. నన్ను శత్రువులా చూస్తుంది. నా ఇంట్లో నేను పరాయివాడిలా ఉన్నాను. ఇదే కదా నీకు సంతోషాన్నిస్తుంది అని విరాట్ అంటాడు.

నన్ను నా ఓపికను పరీక్షించకు అని వార్నింగ్ ఇచ్చి పడుకుంటాడు విరాట్. రోజంతా పొందిన ఆనందాన్ని ఒక్క క్షణంలో మాయం చేశావుగా బావ. నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటావ్ అని బాధపడుతుంది చంద్రకళ. మరోవైపు చంద్రకళ గురించి శ్రుతి, కామాక్షి మాట్లాడుకుంటారు. ఇంతలో వాళ్ల గదికి శ్యామల వస్తుంది. పక్కకు జరిగే అని శ్రుతిని కామాక్షివై...