భారతదేశం, జూలై 31 -- నిన్ను కోరి సీరియల్ టుడే జులై 31వ తేదీ ఎపిసోడ్ లో విడాకుల నోటీస్ మీద సైన్ చేస్తే చాలని శాలినికి చెప్తాడు క్రాంతి. ప్రేమనే పదానికి అర్థం తెలిసి ఉంటే నువ్వు ఇలా ప్రవర్తించే దానివే కదా, ప్రేమ అనే మాట పలికే అర్హత నీకు లేదు శాలిని అని క్రాంతి అంటాడు. ఆ మాటలు బయట నుంచి వింటున్న చంద్రకళ షాక్ అవుతుంది.

విడాకులు ఇచ్చేస్తాను. కానీ అత్తయ్యకు చూపించి, విడిపోవడానికి కారణం అందరికీ చెప్పి సంతకం పెడతానని శాలిని అంటుంది. అత్తయ్య ఇప్పటికే కుమిలిపోతున్నారు. ఈ విషయం తెలిస్తే గుండె పగిలిపోతుంది. మామయ్యలాగే ఆవిడ మంచం మీద పడుతుందని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది శాలిని. నీ విషయంలో ఏం చేయాలో అదే చేస్తానని చెప్పి క్రాంతి వెళ్లిపోతాడు. కుటుంబమే నీ బలహీనత క్రాంతి ఇప్పుడు ఓ ఆడతానని అనుకుంటుంది శాలిని.

నువ్వు శాలినికి విడాకులు ఇవ్వడమేంటీ? ఏం జ...