భారతదేశం, జూలై 30 -- నిన్ను కోరి సీరియల్ టుడే జులై 30వ తేదీ ఎపిసోడ్ లో చంద్రకళను చూడగానే సంతోషంతో టిఫిన్ చేస్తాడు విరాట్. ఆ రాక్షసి బావ మనసు మార్చేసిందా అని కామాక్షితో శ్రుతి అంటుంది. విరాట్ కు పొలమారగానే పరుగెత్తుకుంటూ వచ్చి చంద్ర నీళ్లు తాగిస్తుంది. నిన్ను వాడికి దూరంగా ఉండమని చెప్పా కదా, మళ్లీ ఎందుకు చనువు తీసుకుంటున్నావని శ్యామల కోపంగా అడుగుతుంది. కామాక్షి కూడా మాటలంటుంది.

భర్తకు పొలమారినప్పుడు భార్యగా రియాక్ట్ అవకుండా ఉండలేనని చంద్రకళ అంటుంది. నీలో చాలా షేడ్స్ ఉన్నాయే అని శ్యామల అంటుంది. నేను చూసే రకం కాదు చూపించే రకమని శ్యామల ఫైర్ అవుతుంది. నన్ను ఎందుకు దోషిలా చూస్తున్నారో అర్థం కావడం లేదని చంద్రకళ ఫీల్ అవుతుంది. నా తల్లి స్థానంలో నిలబడి నాకు సపోర్ట్ గా ఉంటానన్నారు. ఒక్కసారి ఆలోచించి చూడండి. నేను మోసం చేసే మనిషినా? అని అడుగుతుంది చ...