భారతదేశం, జనవరి 9 -- నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 9 ఎపిసోడ్ లో ట్రీట్మెంట్ మారితే బెటర్ అని రఘురాం గురించి చెప్తుంది జగదీశ్వరి. కరెక్ట్ గా చెప్పారని విరాట్, చంద్రకళ అంటారు. క్రాంతికి డాక్టర్ ను పిలిపించమని చెప్తుంది జగదీశ్వరి. మరోవైపు మార్కెట్లో సరోజా, జల్ రాజ్ చేపలు అమ్ముతుంటే శ్రుతి గల్లా పెట్టె దగ్గర కూర్చుంటుంది. శ్రుతి అరిస్తే జనాలు వరుస కడతారు.

చేపల గురించి వచ్చినవాళ్లు శ్రుతిని చూస్తూ డబుల్ మీనింగ్ తో మాట్లాడతారు. రాజ్ చేపలన్నీ అమ్మేస్తారు. శ్రుతితో నాకు అల్రెడీ పెళ్లి అయిపోయిందని చెప్పేస్తాడు రాజ్. మరోవైపు డాక్టర్ వస్తాడని శాలిని టెన్షన్ పడుతుంది. అందరూ డాక్టర్ కోసం వెయిట్ చేస్తుంటే అర్జున్ డాక్టర్ గెటప్ లో ఎంట్రీ ఇస్తాడు. నా పేరు ప్రకాష్. ఐయామ్ స్టిల్ బ్యాచిలర్ అనగానే శ్యామల కనెక్ట్ అయిపోతుంది.

మీది గోదావరి జిల్లా కదా. 1995లో...