భారతదేశం, జనవరి 7 -- నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 7 ఎపిసోడ్ లో నా చెల్లిగా ఎలా పుట్టావ్ జగదీశ్వరి అంటూ వరదరాజులు క్యారెక్టర్ లో ఉన్న క్రాంతి రెచ్చిపోతాడు. అన్నయ్య రఘురాం చాలా మంచోడు. తనంటే నాకు ప్రాణమని జగదీశ్వరి క్యారెక్టర్ లో ఉన్న చంద్రకళ చెప్తుంది. శవాల మీద నడిచైనా పరువు నిలబెట్టుకుంటానని రఘురాం లేరా అని కాలర్ పట్టుకుంటాడు వరదరాజులు.

అన్నయ్య కాలర్ వదులు. నా భర్త మీద చేయి వేస్తే ఊరుకోనని జగదీశ్వరి క్యారెక్టర్ లో ఉన్న చంద్రకళ చెప్తుంది. నేను బతికి ఉండగా ఈ పెళ్లి నువ్వు ఆపలేవని శ్యామల అంటుంది. శ్యామల డామినెన్స్ చేస్తుందని మధ్యలో కామాక్షిగా శ్రుతి వస్తే క్రాంతి తోసేస్తాడు. ఈ ఇంట్లో ఏనాటికైనా ప్రేమకు చోటు ఉంటుందని శ్యామల చెప్తుంది. రఘురాం క్యారెక్టర్ లో ఉన్న విరాట్ తాళి తీసుకుని చంద్రకళ మెడలో కడతాడు.

జగదీశ్వరి ఆ తాళి తీసేయ్ అని క్రాంతి ...