భారతదేశం, జనవరి 6 -- నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 6 ఎపిసోడ్ లో ఏదో ఒక ప్రయత్నం చేసి నాన్నకు పెళ్లి రోజు గుర్తు చేయాలి. నువ్వు డాక్టర్ కు కాల్ చేయ్ శాలిని అని క్రాంతి అంటాడు. డాక్టర్ కు కాల్ చేస్తుంది శాలిని. డాక్టర్ ఇంటి నుంచి హాస్పిటల్ కు వెళ్తున్నానని చెప్తే ఢిల్లీ వెళ్తున్నారా? ఫ్లైట్ లో ఉన్నారా? అని కాల్ కట్ చేస్తుంది శాలిని.

నాన్నకు పెళ్లి రోజు గుర్తుంటే అందరికీ మొమోరబుల్ డేగా ఉండేదని చంద్రకళతో విరాట్ అంటాడు. మళ్లీ పెళ్లిని రీక్రియేట్ చేస్తే మామయ్యకు గుర్తొచ్చే ఛాన్స్ ఉంటుందని చంద్ర ఐడియా ఇస్తుంది. మనమే అత్తయ్య బాధను తీర్చాలని చంద్ర అంటుంది. ఈ విషయాన్ని అందరితో డిస్కస్ చేద్దామని విరాట్ అంటాడు.

మామయ్య మీ గురించి నాకు చాలా సార్లు చెప్పేవాడివి. గుర్తు చేసుకోవడానికి ట్రై చేయమని రఘురాంను అడుగుతుంది శాలిని. రఘురాం స్ట్రెస్ తీసుకోవడంతో ...