భారతదేశం, జనవరి 30 -- నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 30 ఎపిసోడ్ లో చంద్రకళను రెడ్ హ్యాండెడ్ గా పట్టిద్దామనే ప్లాన్ తో రెడీగా ఉంటుంది శాలిని. ట్యాబ్లెట్స్ కోసం అందరూ వెతుకుతారు. మెడిసిన్స్ అన్నీ చంద్రనే చూసుకుంటుంది కదా, ఆవిడనే ఇవ్వమంటే సరిపోతుందని కామాక్షి చెప్తుంది. మామయ్యకు టైమ్ కు మెడిసిన్ ఇవ్వాలని శాలిని కూడా అంటుంది.

అన్నయ్యకు ట్యాబ్లెట్స్ ఇవ్వాలని మీ భార్యను రమ్మను అని విరాట్ కు చెప్తుంది శ్యామల. తలనొప్పితో పడుకుందని విరాట్ చెప్తాడు. ఆమెను నేను లేపుతానని శ్యామల పైకి వెళ్తుంది. అప్పుడే ఆటోలో ఇంటికి వస్తుంది చంద్రకళ. బెడ్ రూమ్ లోకి వెళ్లి వచ్చిన శ్యామల నాటకాలు ఆడుతున్నావా విరాట్? గదిలో చంద్రకళ లేదని అంటుంది.

విరాట్ లోపలికి వచ్చి చూసి షాక్ అవుతాడు. ఆ చంద్రకళ ఇంటికి రాలేదు కదా అని శ్యామల సీరియస్ అవుతుంది. అప్పుడే బాత్రూమ్ నుంచి వచ్చిన...