భారతదేశం, జనవరి 29 -- నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 29 ఎపిసోడ్ లో తేజు, అర్జున్ తో కలిసి ఐస్ క్రీమ్ తినడానికి చంద్రకళ వెళ్తుంది. థ్యాంక్స్ అమ్మా, నువ్వు వచ్చినందుకే నాన్న ఐస్ క్రీమ్ కొనిచ్చాడు. నాన్న నువ్వు వచ్చింది అమ్మ మీద ప్రేమతో అని తేజు అంటుంది. అప్పుడే అర్జున్, చంద్రను శాలిని చూస్తుంది. శాలినిని అర్జున్ చూస్తాడు.

శాలిని ముందు తేజు నన్ను అమ్మ అని పిలిచిందంటే కొంపలు అంటుకుంటాయని చంద్రకళ టెన్షన్ పడుతుంది. తేజును పక్కకు తీసుకెళ్లమని డాక్టర్ కు సైగ చేస్తాడు అర్జున్. పండగ పూట ఇంట్లో ఉండకుండా ఐస్ క్రీమ్ తింటూ ఈయనతో టైమ్ పాస్ చేస్తున్నావా? అని శాలిని అంటుంది. ఇప్పుడు ఇది ఇంట్లో చెప్పి చంద్రను బ్యాడ్ చేయాలనా నీ ప్లాన్ అని అర్జున్ అంటాడు.

నీ టాలెంట్ నాకెందుకు తెలియదు? మీ మామయ్యను తలమీద కొట్టిన దగ్గరి నుంచి సైక్రియార్టిస్ట్ ను కలిసిన వరకు అ...