భారతదేశం, జనవరి 28 -- నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 28 ఎపిసోడ్ లో పాప బాధను చూడలేక అమ్మలా దగ్గరయ్యా. ప్లీజ్ బావ నేను వెళ్లకపోతే పాప ఆరోగ్యం పాడవుతుందని విరాట్ ను అడుగుతుంది చంద్రకళ. ఇప్పుడైతే వెళ్లు కానీ ఎప్పుడు పడితే అప్పుడు రాలేనని అర్జున్ కు చెప్పమని విరాట్ అంటాడు.

రఘురాం ఫ్యామిలీ అంతా కలిసి పూజ చేసుకుంటారు. అందరూ ఒకరి తర్వాత ఒకరు రఘురాం, జగదీశ్వరి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అర్జెంట్ పని ఉంది, ఆఫీస్ కు వెళ్తాను అత్తయ్య అని చెప్తుంది చంద్రకళ. ఈ రోజు స్టాక్ వర్క్ చూసుకోవాల్సింది తానేనని చంద్ర చెప్తుంది. రఘురాం చంద్రను వెళ్లమంటాడు.

అమ్మ కోసం తేజు వెయిట్ చేస్తుంటుంది. చంద్ర రాగానే అమ్మా అని హగ్ చేసుకుంటుంది. తేజు నీ డ్రెస్ చాలా బాగుందని చంద్ర చెప్తుంది. ఈ డ్రెస్ నువ్వే కుట్టించావు కదమ్మా అని తేజు అంటుంది. నువ్వు వేసుకుంటే ఇంకా బాగుందని కవ...