భారతదేశం, జనవరి 26 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కాపురం సరిగా చేస్తేనే అంతా సంతోషంగా ఉంటారు అని చంద్రకళ అంటే.. కామాక్షి వచ్చి సెటైర్లు వేస్తుంది. సమయానికి తగ్గట్లు సర్దుకుపోవాలి. నా భర్త మళ్లీ నా దగ్గరికి వస్తాడు. కొంతమంది అది చేతకాక మొగుడిని వదిలేసి తిరుగుతారు మీలాగా అని చంద్రకళ పంచ్ ఇస్తుంది.

ఇంతలో శ్యామల వచ్చి పిలుస్తుంది. జల్ రాజు, శ్రుతికి బట్టలు పెడతారు. కొత్త అల్లుడికి మర్యాదలు అని చెబుతారు. బట్టల్లో డబ్బులు ఉన్నాయా లేదా అని జల్ రాజు చూస్తాడు. వట్టి బట్టలే బ్రో అని విరాట్ అంటాడు. తర్వాత క్రాంతిని పక్కకు పిలిచి తీసుకెళ్తుంది శాలిని. లేట్ చేస్తే మినిస్టర్ గారి పీఏకి మన మీద నెగ్లెజెన్స్ ఫీలింగ్ వస్తుందని శాలిని అంటుంది.

అన్నయ్యకు చెబుతాను అని క్రాంతి అంటే.. అన్నింటికి అన్నయ్య మీద ఆధారపడితే ఎలా. నువ్వే చేయు అని శాలిని అంటుం...