భారతదేశం, జనవరి 24 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ముగ్గులు వేసి భోగి మంట పెడతారు. ఆడవాళ్లందరూ రెడీ అవుతారు. చీరలో చంద్రకళ అందాన్ని చూసి ఫిదా అవుతాడు విరాట్. కాటుక తీసి చంద్ర నడుముకు దిష్టి చుక్క పెడతాడు విరాట్. శాలినికి మెడలో నగ పెట్టి బ్యూటిపుల్‌గా ఉన్నావంటాడు క్రాంతి.

వయసు పెరుగుతున్న మొహంలో కళ తగ్గట్లేదు. మహాలక్ష్మీలా ఉన్నావని రఘురాం అంటాడు. అంతా భోగి మంట దగ్గరికి వస్తారు. శ్రుతి, జాలిరాజ్ కూడా వస్తారు. టిఫిన్ ఖర్చులు తగ్గుతాయని తొందరపెట్టి తీసుకొచ్చాడమ్మా అని కామాక్షితో శ్రుతి అంటుంది. రఘురాం భోగి మంట వెలిగిస్తాడు. అందరూ పిడకలు వేస్తారు.

చంద్రకళ, శాలిని ఒకేసారి వస్తారు. ఇకనైన నీ పాత పగలను భోగి మంటల్లో వేసి ప్రశాంతంగా గడుపు అని చంద్ర అంటే.. ఈ సంక్రాంతి పండుగలో మీకు సంతోషం లేకుండా చేస్తాను చూడు అని శాలిని ఛాలెంజ్ చేస్తుంది. అ...