భారతదేశం, జనవరి 23 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శ్రుతి టార్చర్ పెట్టిన ప్రేమే చూపిస్తే అని జాలిరాజ్ అంటాడు. అసలు నీకు పౌరుషం లేదా అని కోపంగా వెళ్లిపోతుంది శ్రుతి. మరోవైపు రఘురాం రమ్మనడంతో క్రాంతి, విరాట్ వస్తారు. నాగున్న సమస్య కంటే అసలు సమస్య మీరిద్దరు అని రఘురాం అంటాడు.

శాలిని నిలదీయడం, శ్రుతి విషయంలో చంద్రను అనడం గురించి నిలదీస్తాడు రఘురాం. శాలిని, చంద్రల మధ్య ఉన్న గ్యాప్ పోగొట్టాల్సింది మీరే. అందరం కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉండాలని, నా కట్టే కాలేవరకు తోడికోడళ్ల గొడవలు ఉండకూడదురా. ఏం జరిగిన ఇద్దరం కలిసే ఉంటామని మాట ఇవ్వండిరా అని రఘురాం అంటాడు.

దాంతో విరాట్, క్రాంతి మాట ఇస్తారు. రేపే భోగి. ఈ సంక్రాంతి అదిరిపోవాలి అని రఘురాం అంటాడు. తర్వాత యూఎస్ నుంచి ఎమర్జెన్సీ కాల్ వచ్చిందని డాక్టర్ ప్రకాష్ వెళ్తాడు. నేను చెప్పినట్లు జాగ్రత్తగ...