భారతదేశం, జనవరి 3 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చంద్రకళను తల్లి అనుకుని తేజు మాట్లాడుతుంది. నిన్ను కాపాడుకోవడం కోసమే దూరంగా వెళ్లిపోయాను అని చంద్రకళ చెబుతుంది. తేజుకు చంద్రకళ అన్నం తినిపిస్తుంది. తర్వాత కిందకు హాల్లోకి వస్తుంది చంద్రకళ. అర్జున్ వచ్చి ఎందుకు అలా చెప్పారని అడుగుతాడు. ఇప్పుడు పాపకు నిజం చెబితే తట్టుకోలేదు. పాప ప్రాణాలు ముఖ్యం అని చంద్రకళ చెబుతుంది.

మంచి జరిపించడం కోసం

కానీ, ఇక్కడితో ఇది అయిపోయేదు కాదు. చాలా పెద్ద రిస్క్ తీసుకున్నారు అని అర్జున్ అంటాడు. మంచి జరిపించడం కోసం ఆ దేవుడు నాతో అలా చెప్పించాడు అని చంద్రకళ అంటుంది. దాంతో చంద్రకళకు అర్జున్ చేతులెత్తి మొక్కుతాడు. ప్లాంట్ కోసం ల్యాండ్ గురించి శాలినితో క్రాంతి మాట్లాడుతాడు. ప్లాంట్‌కు పర్మిషన్ కావాలి కదా. మినిస్టర్‌కు ట్రై చేస్తే దొరకట్లేదని శాలిని అంటే అన్నయ్...