భారతదేశం, జనవరి 2 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లో అంతా కలిసి కూర్చుని భోజనం చేస్తుంటారు. శాలిని వస్తుంది పక్కన వచ్చి కూర్చోమని విరాట్‌కు చెబుతాడు క్రాంతి. దాంతో శాలిని షాక్ అవుతుంది. చంద్రకళ వడ్డిస్తే క్రాంతి కోపంగా లేస్తాడు. నిన్ను ఎవరు వడ్డించమన్నారు. నా విషయంలో ఎందుకు వస్తున్నావ్. అన్నయ్యతో కలిసిపోయినంత మాత్రాన నీ తప్పులను క్షమిస్తాను అనుకున్నావా నిలదీస్తాడు.

అన్నింట్లో ఎందుకు పెత్తనం చేస్తావు అని విరాట్ అంటాడు. నీ వల్ల నేను బిడ్డను కోల్పోయాను. నిన్ను చచ్చిన క్షమించలేను అని క్రాంతి అంటాడు. దాంతో చంద్రకళ ఏడుస్తుంది. నీ బుద్ధి ఏంటో అన్నయ్యకు తెలిసొచ్చింది. నీ నాటకాలు పనిచేయవని క్రాంతి అంటాడు. ఎందుకు ఇంత పగ అని శాలిని డ్రామా చేస్తుంది.

క్రాంతి తినకుండా వెళ్లిపోతాడు. శాలిని కూడా వెళ్లిపోతుంది. చంద్ర వెళ్లిపోతుంది. చంద్రకళక...