భారతదేశం, జనవరి 13 -- నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 13 ఎపిసోడ్ లో రఘురాం, ప్రకాష్ చెస్ ఆడతారు. చెస్ ఆడటం రాకపోవడంతో మాటలతో మ్యానేజ్ చేద్దామని ప్రకాష్ అనుకుంటాడు. ఇంటి దొంగను పట్టడం అన్నింటికంటే కష్టమైన పని అని ప్రకాష్ అంటాడు. వాళ్లే డేంజర్ అని క్రాంతి, అలాంటి వాళ్లను నామరూపాలు లేకుండా చేయాలని విరాట్ చెప్తారు.

మనిషి మర్చిపోవడం జరగదు. ప్రతి మెమోరీ బ్రైన్ లో ఉంటుందని ప్రకాష్ అంటాడు. నాకు అన్ని గుర్తొస్తాయి. కానీ చెప్పకుండా ఏదో ఆపుతుంది. కేవలం నన్ను కొట్టిన వాళ్లు గుర్తుకు రాకుండా ఉండటం ఏంటీ? అని రఘురాం అంటాడు. వీళ్లను డైవర్ట్ చేయాలని చెస్ బోర్డుపై మంచినీళ్లు పడేలా చేస్తుంది శాలిని.

ఇక గదిలోకి వెళ్లిన చంద్రకళను వెనకాల నుంచి హగ్ చేసుకుంటాడు విరాట్. నాకు చాలా హ్యాపీగా ఉంది. మనం చేస్తుంది డ్రామానే అయినా నాన్నలో ఉత్సాహం కనిపిస్తోందని విరాట్ అం...