భారతదేశం, జనవరి 12 -- నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 12 ఎపిసోడ్ లో మీరు హెల్త్ మీద మాత్రమే కాన్సట్రేట్ చేయండని డాక్టర్ ప్రకాష్ గెటప్ లో ఉన్న అర్జున్ చెప్పడంతో శ్యామల సిగ్గు పడుతుంది. అర్జున్ మీరు శాలినిని ఏమో కానీ మా అత్తను ఏదో చేశారని విరాట్ సరదాగా అంటాడు. మూడు రోజుల్లో మామయ్యను ఎలా క్యూర్ చేస్తారని శాలిని టెన్షన్ పడుతుంది.

ప్రకాష్ కోసం ఉల్లిపాయ పకోడీ చేస్తున్నానని విరాట్ తో చెప్తుంది శ్యామల. ఆయన మీద ఎందుకు కన్సర్న్ చూపిస్తున్నారు? ఆయనను చూడగానే మనసులో వీణలో మోగాయా? అని చంద్రకళ అడుగుతుంది. అతనికి, నాకు ఫ్లాస్ బ్యాక్ లో ఒక బ్యూటీఫుల్ కనెక్షన్ ఉందని పదో తరగతి రోజుల్లో జరిగిన దాన్ని శ్యామల చెప్తుంది. ఇన్నాళ్లకు మళ్లీ అదే పేరు వినేసరికి నాలో చిన్న ఎగ్జైట్మెంట్ కలిగిందని అంటుంది.

ఆ ప్రకాష్, ఈ ప్రకాష్ ఒక్కరు కాదని నా డౌట్ అని చంద్ర అంటుంది. ...