భారతదేశం, జనవరి 10 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సైకియార్టిస్ట్ ప్రకాష్‌కు సేవలు చేస్తుంది శ్యామల. రఘురాంకు ట్రీట్‌మెంట్ ఇప్పుడే మొదలు పెడతానని ప్రకాష్‌‌గా వచ్చిన అర్జున్ అంటాడు. ఇంతలో అర్జున్‌కు మెసేజ్ వస్తుంది. పాప ఇద్దరం లేవని మారం చేస్తుంది. నేను వెళ్తాను అని చెబుతుంది చంద్రకళ.

బ్యాగ్‌తో వచ్చిన చంద్రకళ ఆఫీస్‌లో వర్క్ ఉందని చంద్రకళ వెళ్తుంది. యాక్సిడెంట్ తర్వాత ఎవరు గుర్తున్నారని ప్రకాష్ అడుగుతాడు. తన భార్య జగదీశ్వరి అని రఘురాం చెబుతాడు. రఘురాంను ఒక్కో ప్రశ్న అడుగుతాడు. అన్ని కరెక్ట్‌గా చెబుతాడు రఘురాం.

నేను సైకియో మెమోరీ అనే కొత్త టెక్నిక్ వాడుతున్నాను. దాంతో మూడు రోజుల్లో రఘురాం గారు అన్ని గుర్తు చేసుకుంటారు అని చెబుతాడు ప్రకాష్. ఇక తనకు రెస్ట్ కావాలని ప్రకాష్ వెళ్లిపోతాడు. ఎలాంటి మందులు లేకుండా బాగా ట్రీట్‌మెంట్ ఇస్తున్న...