Hyderabad, ఆగస్టు 9 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బిజినెస్ అంటూ తిరిగితే మా అన్నయ్యను ఎవరు చూసుకుంటారు అని చంద్రకళను అంటుంది కామాక్షి. నువ్ బిజినెస్ చేయడం వీళ్లేదు. ఇంటి కోడలు బయటకు వెళ్లి పరాయి మగాడితో బిజినెస్ చేయడం ఇంటి పరువు తీసినట్లు అవుతుంది అని శ్యామల అంటుంది. నన్ను ఇంటి కోడలిగా ఒప్పుకున్నట్లేనా. అయితే స్టోర్ రూమ్‌లో ఉండక్కర్లేదు అని చంద్రకళ అంటుంది.

బయటి వాళ్ల దృష్టిలో నువ్ ఈ ఇంటి కోడలివి. అలా అన్నాను. నువ్ బయటకెళ్లాక నీకు నచ్చినట్లు ఆడు అని శ్యామల అంటుంది. మీ బ్రెయిన్ పాత డబ్బా ఫోన్ దగ్గరే ఆగిపోయింది. అబ్బాయి, అమ్మాయి స్పేస్‌కు వెళ్తున్న రోజులు. అలాంటిది ఆడది గడప దాటితే పరువు పోతుందని మీరు ఆలోచించడం ఏంటీ. నా భర్త, అత్త ఒప్పుకున్నారు. ఇంకెవరి పర్మిషన్ అవసరం లేదని చంద్రకళ అంటుంది.

తన భవిష్యత్తును అడ్డుకోడానికి మనం ఎవరం ...