Hyderabad, ఆగస్టు 8 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అర్జున్‌తో చంద్రకళ ఫోన్‌లో మాట్లాడుతుంది. ఆఫీస్‌కు త్వరగా వస్తే అందరికి ఇంట్రడ్యూస్ చేస్తాను అని అర్జున్ అంటుంది. సరే అని కాల్ కట్ చేస్తుంది చంద్రకళ. కానీ, ఇంతలో స్టవ్ మీద పెట్టిన పాలు పొంగిపోతాయి. దాంతో శ్యామల వచ్చి తిడుతుంది. కావాలని చేయలేదని చంద్రకళ అంటుంది.

విరాట్ వచ్చి చంద్రకళకు సపోర్ట్ చేస్తాడు. ఫస్ట్ డే ఆఫీస్‌కు వెళ్తున్నావుగా. వెళ్లు అని అంటాడు విరాట్. దాంతో చంద్రకళ వెళ్లిపోతుంది. శ్యామలను మరింత రెచ్చగొట్టాలని కామాక్షి, శ్రుతి అనుకుని వెళ్తారు. పరాయి వ్యక్తితో బిజినెస్ చేస్తుంది. అది మన ఇంటికి ఎంత పరువు నష్టం. రేపు నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. విరాట్, వదిన గుట్టు బయటపడుతుందిగా అని శ్యామలకు కామాక్షి చెబుతుంటుంది.

ఆ మాటలు కింద నుండి జగదీశ్వరి వింటుంది. ఈ ఇంటి కోడలిగా ...