Hyderabad, ఆగస్టు 29 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శ్యామలకు స్నాక్స్ ఇస్తుంది శ్రుతి. టైమ్ అవుతుందని కామాక్షి టెన్షన్ పడుతుంది. ఇంతలో కొరియర్ అని వస్తుంది. శ్రుతిని శ్యామల చూడమంటుంది. కామాక్షి వెళ్తే.. శ్రుతి ఆపుతుంది. ఇది చాలా దూరం వెళ్తుందే అని కామాక్షి అంటే.. నాకు జరిగిన అవమానానికి జరగాల్సిందే. నా మీద ఒట్టే నువ్ వస్తే అని శ్రుతి అంటుంది.

ఎవరు పలక్కపోవడంతో శ్యామల వెళ్తుంది. కానీ, ఇంతలో చంద్రకళ వచ్చి తీసుకుంటానంటుంది. కానీ, శ్యామలకు కొబ్బరి పెంకులు గుచ్చడంతో చంద్రకళ వెనక్కి వస్తుంది. ఆ పెంకులు బయట పడేయమని చంద్రకళను పంపించిన శ్యామల కొరియర్ తీసుకోడానికి వెళ్తుంది. కానీ, ఇంతలో జగదీశ్వరి వచ్చి శ్యామలను ఏదో చూడమంటుంది.

అలా ట్విస్టుల మీద ట్విస్టులు అయ్యాక జగదీశ్వరి వెళ్లి కొరియర్ తీసుకుంటుంది. శాలిని కోసం కొరియర్ వచ్చిందని అది ఓపెన...