Hyderabad, ఆగస్టు 23 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో వరలక్ష్మీ వ్రతం తర్వాత చంద్రకళ, శాలిని అమ్మవారికి హారతి ఇస్తారు. భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మని పంతులు చెబితే అలాగే తీసుకుంటారు. తర్వాత పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. నీ కోరిక నెరవేరాలని చంద్రకళను శ్యామల ఆశీర్వదిస్తుంది. తర్వాత క్రాంతి, శాలిని ఆశీర్వాదం తీసుకుంటారు.

భార్యలకు భర్తలతో చీరలు ఇప్పిస్తాడు పంతులు. మీకు అంతా శుభమే జరుగుతుంది అని పంతులు అంటాడు. అలాగే, మళ్లీ భర్తతో మూడు ముళ్లు వేయించుకుని అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నావు. మీ బంధాన్ని ఎవ్వరు విడదీయలేరు అని పంతులు ఆశీర్వదిస్తాడు. దాంతో శ్యామల, కామాక్షి టెన్షన్ పడతారు. ముత్తైదువులకు చంద్ర, శాలిని వాయినాలు ఇస్తారు.

తర్వాత చంద్రతో శాలిని ప్రేమగా మాట్లాడుతుంది. మూడు ముళ్లు వేయించుకోడవం గురించి పొగుడుతుంది. వాళ్లను ఇల...