Hyderabad, ఆగస్టు 21 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చంద్రకళతో శాలిని ప్రేమగా మాట్లాడుతుంది. అది చూసిన గౌతమ్ నిజంగానే శాలినిలో మార్పు మొదలైనట్లుంది అని అనుకుంటాడు. పూజలో ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోమ్మని జగదీశ్వరి చెబుతుంది. ఆ ప్లేట్స్ ఇక్కడే పెట్టి వెళ్లండి నేను తీసుకొస్తాను అని క్రాంతి అంటాడు. దాంతో చంద్ర, శాలిని వెళ్లిపోతారు.

కానీ, గౌతమ్ కూడా వెళ్లిపోతాడు. అదంతా చూసిన కామాక్షి ఈ చీరలు సమర్పిస్తేనే కదా వ్రతం పూర్తయ్యేది అని ఆ రెండు ప్లేట్స్ తీసుకెళ్లి బీరువాలో పెడుతుంది. శాలిని నువ్ క్రాంతి మెప్పు కోసం శత్రువుతో కలిసి వ్రతం చేస్తున్నావ్. మమ్మల్ని పక్కన పెట్టావ్. ఈ కామాక్షి అంటే ఏంటో చూపిస్తా అని కామాక్షి అంటుంది. శాలిని, చంద్రకళ వ్రతంలో కూర్చుంటారు.

పూర్ణం కోసం వేసిన పప్పు మాడగొడుతుంది శ్రుతి. ఏంటే ఇదంతా, ఇలా చేశావ్ అని కామాక్...