Hyderabad, ఆగస్టు 2 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అర్జున్‌కు చంద్రకళ ట్రీట్‌మెంట్ చేసి పంపించేస్తుంది. ఎవరతను అని అనుమానంగా కామాక్షి, శ్రుతి అడిగితే గొడవ గురించి చెప్పి, అనవసరంగా సీన్ క్రియేట్ చేయొద్దని వారిస్తుంది చంద్రకళ. అప్పుడే వచ్చిన శ్యామల విని కోప్పడుతుంది. ఇలా ఎవరినిపడితే వాళ్లను తీసుకురావొద్దు కదా అని అంటుంది.

మరోవైపు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన విరాట్ తలనొప్పిగా ఉందని బాధపడుతుంటాడు. కాఫీ తీసుకొస్తానని చెప్పి వెళ్లిన శ్రుతి విరాట్ గురించి కామాక్షి చెబుతుంది. అప్పుడు చంద్రకళ చేసింది విరాట్‌కు చెబితే తనపై కోప్పడతాడు అని ప్లాన్ వేస్తారు. దాంతో తల్లీకూతుళ్లు ఇద్దరు కలిసి విరాట్‌ దగ్గరికి వెళ్లి చంద్రకళ గురించి చెబుతారు.

చంద్రకళ ఇవాళ ఒకతన్ని ఇంటికి తీసుకొచ్చింది. ట్రీట్‌మెంట్ ఇచ్చి మరి పంపించింది. రౌడీలు ఏడిపిస్తుంటే కాపాడట....