Hyderabad, ఆగస్టు 15 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నా తప్పు సరిదిద్దుకుంటున్నాను. నీకు తగ్గట్టుగా నడుచుకుంటున్నాను. మన బంధంలో సమస్యలు రాకుంటే నువ్వు కూడా నా ఫీలింగ్స్‌కు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నువ్ నాకు ఛాన్స్ ఇచ్చావ్. నీకు నువ్వుగా ఇస్తే బాగుంటుంది అని శాలిని అంటే.. ఇక్కడ కూడా చంద్ర వదినపై అసూయ పడుతున్నావా అని క్రాంతి అంటాడు.

ఇక్కడ సమస్య చంద్ర కాదు. నువ్వే. చంద్రకళ ఒక్కరే కాదు ఎవరిపై నువ్వు ఆధారపడకూడదని చెబుతున్నా అని శాలిని అంటుంది. ముందు చంద్ర వదిన గురించి తప్పుగా ఆలోచించడం మానేయి. అంత ఒక్కటే ఫ్యామిలీ. కలిసి బతకాలి. నీ మనసులో ఇంకా తనపై అసూయ లాంటిది ఉంటే తీసేయ్ అని క్రాంతి అంటాడు. అలాగే అని శాలిని అంటుంది.

మరోవైపు చంద్రకళకు మెకానిక్ కాల్ చేసి బైక్ రెండు రోజుల్లో రెడీ అవుతుందని చెబితే కోప్పడుతుంది. ఆ మాటలు విరాట్ వింటాడు....